రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. హౌరా, లిలువా, సీల్దా, కంచరాపరా, మాల్దా, అసన్‌సోల్, జమాల్పూర్ వంటి వివిధ డివిజన్‌లలో అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 14.
చివరి తేదీ: సెప్టెంబర్ 13.
అర్హతలు:
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50% మార్కులతో టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటుగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) ద్వారా జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI)సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయస్సు: ఆగస్టు 14, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఫీజు:
అప్లికేషన్ ఫీజు రూ. 100 గా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు (PwBD),మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
ఈ అప్రెంటిస్ పోస్టుల ఎంపిక విధానం చాలా సులభంగా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. అభ్యర్థులు టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను తయారు చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందుకే అప్లికేషన్ ఫారమ్‌లో వివరాలు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.
అప్లికేషన్ విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు RRC ఈస్టర్న్ రైల్వే యొక్క అధికారిక వెబ్‌సైట్ rrcer.org ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.






Iti