HomeJOBSఐటీఐ,డిగ్రీ అర్హతతో.. 6565 ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టులు

ఐటీఐ,డిగ్రీ అర్హతతో.. 6565 ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టులు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ .. 2026-27 ఏడాదికి గానూ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ (CEN No. 02/2026) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,565 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, అలాగే వివిధ రకాల టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. జూన్ 30 వ తేదీ నుంచి జులై 29 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్రాత పరీక్ష,డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థును ఎంపిక చేస్తారు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు.

నోటిఫికేషన్ వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,565 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా వివరాలు..

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ (Level 5): 323 పోస్టులు

టెక్నీషియన్ గ్రేడ్-III (Level 2): 6,242 పోస్టులు

ఎవరు అర్హులు?

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే పోస్టును బట్టి కింది విద్యార్హతలు ఉండాలి.

టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్: అభ్యర్థులు ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

టెక్నీషియన్ గ్రేడ్ III: టెన్త్ పాస్ అవ్వడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI (NCVT/SCVT) లేదా యాక్ట్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయస్సు :
గ్రేడ్-I పోస్టులు:అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.

గ్రేడ్-III: 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.

(ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, EWS, ఇతరులకు వయస్సులో సడలింపు ఉంటుంది).

సెలెక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) ఉండదు. కేవలం మూడు స్టేజ్‌లలో సెలెక్షన్ పూర్తి చేస్తారు.

1.కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

2.డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)

  1. మెడికల్ ఎగ్జామినేషన్

CBT పరీక్షా విధానం:
మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు. ఎగ్జామ్ టైమ్ 90 నిమిషాలు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కట్ అవుతుంది.

ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 30వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

చివరి తేదీ: జులై 29 (రాత్రి 11:59 గంటల) వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం:

1.మొదట ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ లోకి లాగిన్ అవ్వాలి.

  1. అనంతరం CEN 02/2026 – Technician లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోండి.
  2. మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ నింపి, ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
  3. ఫీజు చెల్లించి, అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
  4. ఒక అభ్యర్థి కేవలం ఒక ఆర్‌ఆర్‌బీ (RRB) జోన్‌కు, ఒకే పే లెవెల్‌కు మాత్రమే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here