రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (CEN 02/2026) గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ , గ్రేడ్-III కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఉద్యోగాల కోసం ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. జులై 29 వరకు అవకాశం ఉంది. బీస్సీ,డిప్లొమా,బీఈ/బీటెక్, లేదా ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాబట్టి అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం రెండు రకాల మేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ (Grade-I Signal): దీనికి మొత్తం 1,323 ఖాళీలు ఉన్నాయి. 7th CPC ప్రకారం వీరికి లెవెల్-5 కింద రూ.29,200 ప్రారంభ బేసిక్ పే లభిస్తుంది.
టెక్నీషియన్ గ్రేడ్-III (Grade-III): ఇందులో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ లాంటి 24 కేటగిరీలు ఉన్నాయి. మొత్తం ఖాళీలు 5,234. వీరికి లెవెల్-2 కింద రూ.19,900 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది.
విద్యార్హతలు:
గ్రేడ్-I సిగ్నల్: ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ లో బీస్సీ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా/బీటెక్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల లోపు ఉండాలి.
గ్రేడ్-III: టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ (ITI) లేదా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కంపల్సరీ. వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు అభ్యర్థుల వయస్సు ఉండాలి.
గమనిక: ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :రైల్వే బోర్డ్ అభ్యర్థుల కేటగిరీని బట్టి ఫీజును నిర్ణయించింది. సీబీటీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇందులో కొంత అమౌంట్ రీఫండ్ అవుతుంది.
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.500 (ఎగ్జామ్ రాశాక రూ.400 రీఫండ్ అవుతుంది)కాగా.. ఎస్సీ /ఎస్టీ /ఎక్స్-సర్వీస్మెన్ /మహిళలు /ఈబీసీలకు రూ.250 (ఎగ్జామ్ రాశాక పూర్తి రూ.250 రీఫండ్ అవుతుంది).
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేయడానికి చివరి తేదీ: జులై 29 వరకు ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఎడిట్ విండో: ఆగస్టు 01 నుంచి ఆగస్టు 10 వరకు అభ్యర్థులు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా మూడు స్టేజీల్లో జరుగుతుంది. మొదట 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్కింగ్ (1/3rd) కూడా ఉంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ rrb.indianrailways.gov.in ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.





