రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)టెక్నీషియన్ గ్రేడ్- 1, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి సంబంధించి అప్లికేషన్ గడువును పొడిగించింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 6,238 టెక్నీషియన్ పోస్టుల కోసం అప్లై చేసుకోవడానికి మొదట జులై 28 చివరి తేదీ అవకాశం ఇవ్వగా.. అభ్యర్థుల సౌలభ్యం కోసం దీనిని ఆగస్టు 7 వ తేదీ వరకు పొడిగించారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: జూన్ 28
ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ఆగస్టు 7 వరకు అవకాశం ఉంటుంది.
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: అభ్యర్థులు ఆగస్టు 9 వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)తేదీ: త్వరలో పరీక్ష తేదీ వివరాలు అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తారు.
ఖాళీల వివరాలు:
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: 183 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్-3: 6055 పోస్టులు
మొత్తం పోస్టులు: 6238
అర్హతలు:
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్‌లో బీఈ/బీ.టెక్, ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బి.ఎస్సీ డిగ్రీ కలిగి ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్-3: 10వ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ లేదా పీసీఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) సబ్జెక్టులతో ఇంటర్ పాసై ఉండాలి.
వయస్సు (జులై 1, 2025 నాటికి):
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: 18 నుంచి 33 సంవత్సరాలు.
టెక్నీషియన్ గ్రేడ్-3: 18 నుంచి 30 సంవత్సరాలు.
రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా.. అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ చేసుకొని.. ఆన్‌లైన్ ఫారమ్‌ను ఫిల్ చేయాలి. తర్వాత అవసరం అయిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి.






RRB