రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) పారామెడికల్ విభాగంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 560 తాత్కాలిక పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిఫికేషన్ వివరాలు:
ఈ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను కాట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. 7వ వేతన సంఘం (7th CPC) సిఫార్సుల ప్రకారం ఈ పోస్టులకు పే లెవెల్ 3 నుంచి పే లెవెల్ 7 వరకు జీతం లభిస్తుంది. అర్హతను బట్టి నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మాసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, డయాలసిస్ టెక్నీషియన్ వంటి పలు రకాల ముఖ్యమైన పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 15 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చివరి తేదీ: అక్టోబర్ 14వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత పారామెడికల్ కోర్సుల్లో డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి. పోస్టును బట్టి విద్యార్హతలు మారుతుంటాయి కాబట్టి, పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.





