రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) తీపి కబురు అందించింది. CEN 06/2024 నోటిఫికేషన్ కింద నిర్వహించిన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ (UG) రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 2) ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్ 20న జరిగిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజల్ట్స్, స్కోర్‌కార్డులను అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మార్కులు, అర్హత స్టేటస్‌ను తెలుసుకోవడానికి స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ రిజనల్ ఆర్ఆర్బీ వెబ్‌సైట్ లాగిన్ పేజీలో రిజిస్ట్రేషన్ నంబర్ , పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి. సరైన వివరాలు సబ్మిట్ చేయగానే మీ స్క్రీన్‌పై స్కోర్‌కార్డ్ కనిపిస్తుంది. దీనిని ప్రింట్ లేదా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవడం మంచిది.
మొత్తం ఖాళీలు,పోస్టుల వివరాలు:
రైల్వే బోర్డు ఈ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 3,445 పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ కేటగిరీల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ..
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు
ట్రైన్ క్లర్క్: 72 పోస్టులు
ఎంపిక విధానం:
ఈ రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-2) లో సాధించిన 100 మార్కులకు గాను వచ్చిన మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ జరిగింది. అయితే.. కేవలం సీబీటీ-2లో క్వాలిఫై అయినంత మాత్రాన ఉద్యోగం ఖాయం కాదని బోర్డు స్పష్టం చేసింది. తుది ఎంపిక అనేది అభ్యర్థుల మొత్తం మెరిట్, వారు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఉంటుంది.
దీంతో పాటు జూనియర్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ లాంటి పోస్టులకు ప్రత్యేకంగా టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో కూడా అర్హత సాధించిన వారికి చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి.ఈ అన్ని దశల్లో సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయిన వారికే రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది.





