రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC )కింద గ్రాడ్యుయేట్ లెవల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8050 పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు www.rrbapply.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 5000
గ్రాడ్యుయేట్ లెవల్
పోస్టుల వారీగా:
స్టేషన్ మాస్టర్: 615
గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3423
ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే): 59
చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ (CCTS): 161
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ (JAA): 921
సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్: 638
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 21 వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్లకు చివరి తేదీ: నవంబర్ 20లోపు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- పోస్టుల వివరాలు:
అండర్ గ్రాడ్యుయేట్ లెవల్
మొత్తం పోస్టుల సంఖ్య: 3050
పోస్టులు:
జూనియర్ కం టైపిస్ట్: 163
అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్: 394
ట్రైన్స్ క్లర్క్: 77
కమర్షియల్ కం టికెట్ క్లర్క్: 2424
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులు రూ. 250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం (సెలెక్షన్ ప్రాసెస్):
అభ్యర్థులను ఈ కింది అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రెండు అంచెల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
స్కిల్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.rrbapply.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.





