రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రతిష్టాత్మకమైన ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించి CEN No. 06/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 3,477 ఖాళీల భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫకేషన్ కుసంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: అక్టోబర్ 8 వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చివరి తేదీ: నవంబర్ 6 రాత్రి 11:59 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం పే లెవెల్ 5 , పే లెవెల్ 6 కింద జీతం ఇస్తారు. కేటాయించిన పోస్టును బట్టి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వయస్సును 2027 జనవరి 1 నాటికి లెక్కగడతారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు: ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు.. రూ.500 , ఎస్సీ,ఎస్టీ ఎక్స్-సర్వీస్‌మెన్ / పీడబ్ల్యూబీడీ/ మహిళలు / ట్రాన్స్‌జెండర్ / మైనారిటీలు / అభ్యర్థులకు.. రూ. 250 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం:
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో కనిపించే RRB NTPC CEN No. 06/2026 అప్లై లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ సరైన వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయండి.
- విద్యార్హత, ఇతర వివరాలను ఎంటర్ చేయండి.
- మీ ఫోటో, సంతకం , అవసరం అయిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- మీ కేటగిరీకి తగిన అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని సేవ్ చేసుకోండి.





