Homeవార్తలుజనవరిలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిజల్ట్స్​

జనవరిలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిజల్ట్స్​


రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) నిర్వహించిన నాన్-టెక్నిక‌ల్‌ కేటగిరీ (ఎన్​టీపీసీ) రిజల్ట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్​న్యూస్​ చెప్పింది. ఎన్టీపీసీ ప్రిలిమ్స్​ ఫలితాలను 2022 జనవరి 15న ప్రకటిస్తామని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్టీపీసీ కింద దాదాపు 35,208 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్ఆర్​బీ 2019లో నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య దశల వారీగా కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్ (సీబీటీ-1)ను నిర్వహించారు.

Advertisement


ప్రాంతీయ రైల్వే వెబ్​సైట్​లో ఫలితాలు
తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని సరిచేసి ఫైనల్​ కీ విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. వచ్చే నెల జనవరి 15న సీబీటీ-1 ఫలితాలను విడుదల చేసేందుకు ఆర్ఆర్​బీ సిద్దమవుతోంది. ఈ ఫలితాలను అభ్యర్థులు తమ ప్రాంతీయ రైల్వే జోన్ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు https://rrbsecunderabad.nic.in/ వెబ్​సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షకు హాజరైన వారు రిజిస్టర్డ్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ వంటి వివరాలతో లాగిన్ అయ్యి రిజల్ట్ చూసుకోవచ్చు.


ఫిబ్రవరిలో సీబీటీ 2 ఎగ్జామ్​
షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులకు సీబీటీ–2ను 2022, ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు నిర్వహిస్తామని ఆర్‌ఆర్‌బీ తెలిపింది. అభ్యర్థులు ఏవైనా వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే చూడాలని.. ఫేక్‌న్యూస్‌లను నమ్మి మోసపోకండి అని సూచించింది.


భర్తీ చేయనున్న పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్స్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, భారతీయ రైల్వేలోని వివిధ జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్లలో స్టేషన్ మాస్టర్ పోస్టులకు ఈ పరీక్షను ఆర్‌ఆర్‌బీ నిర్వహించింది.

Advertisement

RECENT POSTS

DAILY TESTS

CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!