నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ CEN 04/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 3993 జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు..
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్ట్ 14 నుంచి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: సెప్టెంబర్ 13 రాత్రి 11:59 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
విద్యార్హతలు:
జూనియర్ ఇంజనీర్ (JE): అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో (మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ మొదలైనవి) మూడేళ్ల డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ (B.E/B.Tech) పూర్తి చేసి ఉండాలి.
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: ఏదైనా బ్రాంచ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా తత్సమాన డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయస్సు :
అభ్యర్థుల వయస్సు 01 జనవరి 2027 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం (7th CPC) సిఫారసుల ప్రకారం లెవల్-6 పే స్కేల్ ఉంటుంది. ప్రారంభ జీతం నెలకు రూ.35,400 వరకు లభిస్తుంది.
ఎంపిక విధానం :
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు నాలుగు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ : ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఇందులో మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది (ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ చేస్తారు).
రెండో దశ CBT (2nd Stage CBT): టెక్నికల్ సబ్జెక్టులపై ప్రత్యేకంగా ఈ పరీక్ష ఉంటుంది.
డాక్యెమెంట్ వెరిఫికేషన్
మెడికల్ టెస్ట్
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrb.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.





