HomeJOBSరైల్వేలో 2,569 ఉద్యోగాలు.. అప్లై చేశారా ?

రైల్వేలో 2,569 ఉద్యోగాలు.. అప్లై చేశారా ?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB).. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 2569 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 33 ఏళ్ల వయస్సు లోపు ఉన్న వారు ఇందుకు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో నవంబర్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది

పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు – 2569
సంస్థ పేరు- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)
పోస్ట్ పేరు- జూనియర్ ఇంజనీర్
అర్హత: అభ్యర్థులు బీఈ/ బీటెక్, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: నవంబర్ 30వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: rrbguwahati.gov.in

వయస్సు: (01-01-2026 నాటికి):
అభ్యర్థుల కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు ఉండాలి.
జీతం: అభ్యర్థులకు నెలకు 35,400 జీతం చెల్లిస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి మూడేళ్ల డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ) లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా మూడేళ్ల సివిల్ ఇంజనీరింగ్‌లో B.Sc. ఇతర ప్రత్యేక విభాగాలలో డిప్లొమా (ఉదా. ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, టూల్స్ అండ్ డై మేకింగ్ మొదలైనవి) కూడా అర్హత కలిగి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్స్యూడీ/మహిళలు/మాజీ సైనికులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-I)
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-II)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
మెడికల్ టెస్ట్.

అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో rrbguwahati.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here