HomeJOBSరైల్వేలో 4,029 ఉద్యోగాలు..అప్లికేషన్‌కు రేపే లాస్ట్ డేట్

రైల్వేలో 4,029 ఉద్యోగాలు..అప్లికేషన్‌కు రేపే లాస్ట్ డేట్

రైల్వే ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగులకు అలర్ట్! ఆర్‌ఆర్‌బీ జేఈ, డిఎంఎస్, సిఎంఏ పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్ అప్లికేషన్ గడువు రేపటితో (సెప్టెంబర్ 13) ముగియనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 4,029 ఖాళీల భర్తీకి జరుగుతున్న ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే అప్లై చేయడం మంచిది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు

మొత్తం పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 4,029 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఒరిజినల్‌గా ప్రకటించిన 3,993 పోస్టులతో పాటు, కరెజెండమ్ ద్వారా తాజాగా చేర్చిన 36 సిఎంఏ , ఇతర పోస్టులు కూడా ఉన్నాయి.

అర్హతలు:
సంబంధిత బ్రాంచ్‌లలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జేఈ , డిఎంఎస్ పోస్టులకుఅ ప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే ఫిజిక్స్ , కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ పూర్తి చేసిన వారు సిఎంఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం, పరీక్షా సరళి:
ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో .. భాగంగా అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-I , CBT-II) పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ (ME) నిర్వహిస్తారు. మొదటి దశ సీబీటీలో మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు (1/3) నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 6 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. దీని ప్రకారం ప్రారంభ జీతం సుమారు రూ.35,400 వరకు ఉంటుంది.

అప్లై చేసుకునే విధానం:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో.. మొబైల్ నంబర్ , ఈమెయిల్ ఐడీని తప్పులు లేకుండా ఇవ్వాలి. ఎందుకంటే వాటిని తర్వాత మార్చడానికి వీలుపడదు. ఒక అభ్యర్థి కేవలం ఒకే ఒక ఆర్‌ఆర్‌బీ జోన్‌ను ఎంచుకోవడానికి అవకాశం ఉంది. రేపే ఆఖరు తేదీ కాబట్టి.. చివరి నిమిషంలో సర్వర్ బిజీ సమస్యలను నివారించడానికి వెంటనే పూర్తి చేయడం మంచిది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here