రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB).. ఐసోలేటెడ్ కేటగిరీకి చెందిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 312 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు జనవరి 29వరకు ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు- 312
పోస్టుల వారిగా..
చీఫ్ లా అసిస్టెంట్- 22
పబ్లిక్ ప్రాసిక్యూటర్- 07
జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ)- 202
స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్- 24
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ (III)- 39
ఇతర పోస్టులు-18
అర్హతలు:
విద్యార్హత: అభ్యర్థులు పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, లా (LLB), లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. (1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది).
ట్రాన్స్‌లేషన్ టెస్ట్: కేవలం జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు మాత్రమే ఈ పరీక్ష ఉంటుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV): మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పిలుస్తారు.
మెడికల్ టెస్ట్: నిర్ణీత ప్రమాణాల ప్రకారం మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
అప్లికేషన్లకు చివరి తేదీ: అభ్యర్థులు జనవరి 29 వరకు ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.(పరీక్ష రాసిన తర్వాత ₹400 రీఫండ్ చేస్తారు)
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మాజీ సైనికులు/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి (పరీక్ష రాసిన తర్వాత మొత్తం డబ్బు రీఫండ్ చేస్తారు).
అప్లికేషన్ విధానం:
అర్హత గల అభ్యర్థులు తమకు నచ్చిన RRB ప్రాంతీయ వెబ్‌సైట్ (ఉదాహరణకు: rrbsecunderabad.gov.in) లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





