రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్-డి (Level 1) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22,195 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం అవుతాయి. కేవలం రూ. 250 నుంచి రూ. 500 ఫీజుతో.. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వీలుంది. అభ్యర్థులు మార్చి 2వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్వే గ్రూప్-డి రిక్రూట్‌మెంట్ 2026: పూర్తి వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్ వంటి 14 రకాల విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు:
మొత్తం 22,195 పోస్టులను.. దేశవ్యాప్తంగా ఉన్న 16 రైల్వే జోన్లలో భర్తీ చేస్తున్నారు.
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఐటీఐ (NCVT/SCVT)సర్టిఫికేట్ కలిగి ఉండాలి. నేషనల్ అప్రెంటిస్ షిప్ (NAC) ఉన్నవారు కూడా అర్హులే.
వయస్సు(01.01.2026 నాటికి): అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ (NCL) అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500 (పరీక్షకు హాజరైన తర్వాత రూ. 400 వెనక్కి ఇస్తారు). ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు, మైనారిటీలకు: రూ. 250 (పరీక్షకు హాజరైన తర్వాత మొత్తం ఫీజు వెనక్కి ఇస్తారు).
ఎంపిక విధానం:
అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), శారీరక సామర్థ్య పరీక్ష (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ,మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbchennai.gov.in లేదా సంబంధిత ప్రాంతీయ RRB వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి.





