HomeJOBSటెన్త్, ఐటీఐ అర్హతతో.. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 1,012 ఉద్యోగాలు

టెన్త్, ఐటీఐ అర్హతతో.. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 1,012 ఉద్యోగాలు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా 22,082 గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెయినర్ వంటి కీలక విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. టెన్త్ లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 2వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వేలో 1,012 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన CEN నెం. 09/2025 నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 16 జోన్లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమకు ఇష్టమైన లేదా ఎక్కువ పోస్టులు ఉన్న ఏదేని ఒక జోన్‌ను ఎంచుకుని అప్లై చేసుకోవచ్చు.

జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు-22,082

నార్తన్ రైల్వే (ఢిల్లీ) -3,537
వెస్ట్రన్ రైల్వే (ముంబై)-2,148
సెంట్రల్ రైల్వే (ముంబై)-1,979
నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (గువాహటి)-1,776
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (బిలాస్‌పూర్)-1,199
నార్త్ ఈస్ట్రన్ రైల్వే (గోరఖ్‌పూర్)-1,196
నార్త్ సెంట్రల్ రైల్వే (ప్రయాగ్‌రాజ్)-1,181
వెస్ట్ సెంట్రల్ రైల్వే (జబల్‌పూర్)- 1,147
సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)-1,012
సదరన్ రైల్వే (చెన్నై)-1,036
ఈస్ట్రన్ రైల్వే (కోల్‌కతా)/మెట్రో-1,000
ఈస్ట్ సెంట్రల్ రైల్వే (హాజీపూర్)- 993
నార్త్ వెస్ట్రన్ రైల్వే (జైపూర్)-974
సౌత్ ఈస్ట్రన్ రైల్వే (కోల్‌కతా)-949
ఈస్ట్ కోస్ట్ రైల్వే (భువనేశ్వర్)-803
సౌత్ వెస్ట్రన్ రైల్వే (హుబ్లీ)-90

భర్తీ చేసే పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలోని వివిధ టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో సిబ్బందిని నియమిస్తారు.
1.పాయింట్స్ మన్
2.ట్రాక్ మెయింటెయినర్
3.అసిస్టెంట్ లోకో షెడ్
4.అసిస్టెంట్ ఆపరేషన్స్
ఇతర అసిస్టెంట్ విభాగాలు

విద్యార్హతలు :
అభ్యర్థులు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) / స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT) ద్వారా జారీ చేసిన ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

  1. వయస్సు:
    సాధారణంగా అభ్యర్థుల వయస్సు18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
  2. అప్లికేషన్ షెడ్యూల్ :
    అప్లికేషన్ చివరి తేదీ: మార్చి 2వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అధికారిక వెబ్ సైట్ వివరాలు:
అభ్యర్థులు తాము అప్లై చేయాలనుకుంటున్న జోన్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రధాన వెబ్‌సైట్లు..

RRB సికింద్రాబాద్- www.rrbsecunderabad.gov.in
RRB చెన్నై- www.rrbchennai.gov.in
RRB ముంబై- www.rrbmumbai.gov.in
RRB న్యూఢిల్లీ- www.rrbcdg.gov.in

ఎంపిక విధానం:
అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), శారీరక సామర్థ్య పరీక్ష (PET),డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here