HomeJOBSనిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. రైల్వేలో 22,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. రైల్వేలో 22,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB).. గ్రూప్ డి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్ లేదా ఐటీఐ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా rrbchennai.gov.in అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన వివరాలు:

సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)

పోస్ట్ పేరు: గ్రూప్-D (ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ పాయింట్స్ మన్, ఇతర పోస్టులు)

మొత్తం పోస్టులు: 22,000

ఖాళీల వివరాలు (పోస్టుల వారీగా):

ట్రాక్ మెయింటెనర్ (గ్రేడ్ IV)-11,000

పాయింట్స్ మన్ B- 5,000

అసిస్టెంట్ (S & T)-1,500

అసిస్టెంట్ (C & W)-1,000

అసిస్టెంట్ (P-way)-300

మిగిలిన పోస్టులు (Bridge, Machine, Electrical, etc.)-3,200

అర్హతలు:

విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు(01-01-2026 నాటికి): అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోప రిమితిలో సడలింపు ఉంటుంది)

జీతం: ఎంపికైన వారికి నెలకు రూ. 18,000 జీతం ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: జనవరి 20 నుంచి అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: ఫిబ్రవరి 20 వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ విధానం:

1.అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.

2.ముందుగా RRB అధికారిక వెబ్‌సైట్ rrbchennai.gov.in లోకి లాగిన్ అవ్వండి.

‘3.CEN 09/2025’ నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

4.తర్వాత మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.

5.అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

6. ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here