రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) నుంచి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 600 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా, బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 12 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
సంస్థ పేరు: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES)
పోస్ట్ పేరు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు: 600
అధికారిక వెబ్‌సైట్: rites.com
విద్యార్హత: B.Sc, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.
గరిష్ట వయస్సు: అభ్యర్థుల వయస్సు 40 సంవత్సరాలకు మించకూడదు.
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: అభ్యర్థులు నవంబర్ 12వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
రాత పరీక్ష తేదీ: నవంబర్ 23న రాత పరీక్ష నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 300 + జీఎస్టీ, EWS/ SC/ST/ PWD అభ్యర్థులు రూ. 100 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు rites.com లోని అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.





