డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ‘ఆర్ఐఎంసీ’లో 8వ తరగతి ప్రవేశాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.
గుర్తింపు పొందిన పాఠశాలలో 2023 జనవరి 1 నాటికి ఏడోతరగతి పాసైన వారు లేదా ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు పన్నెండున్నర నుంచి 13ఏళ్ల మధ్య ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
రాత పరీక్ష మొత్తం 400 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 125, మ్యాథ్స్ నుంచి 200, జనరల్ నాలెడ్జ్ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి 50 మార్కులకు వైవా నిర్వహిస్తారు. ఇందులో ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలు పరీక్షిస్తారు. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అడ్మిషన్లు ఇస్తారు.
ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.555 ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు చెల్లించిన వారికి ఆర్ఎంసీ దరఖాస్తు ఫారంతో పాటు పాత ప్రశ్నాపత్రాలను స్పీడ్ పోస్టు ద్వారా పంపిస్తారు. విద్యార్థులు దరఖాస్తు ఫారాలను నింపి, అవసరమైన దృవపత్రాలను నింపి టీఎస్పీఎస్సీ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్‌కు చివరితేది ఏప్రిల్ 25. రాత పరీక్ష జూన్ 4న నిర్వహిస్తారు.
వెబ్సైట్ . www.rimc.gov.in
www.tspsc,gov.in