Homeవార్తలుబాసర అడ్మిషన్​ ప్రాసెస్​.. మళ్లీ మారింది

బాసర అడ్మిషన్​ ప్రాసెస్​.. మళ్లీ మారింది

బాసర ట్రిపుల్​ ఐటీ RGUKT (రాజీవ్​గాంధీ యూనివర్సిటీ ఆఫ్​ నాలెడ్డ్ టెక్నాలజీస్​) 2022–23 అడ్మిషన్ల ప్రాసెస్​ పాత పద్ధతిలోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటీ రెండు రోజుల్లో అందుకు సంబంధించిన నోటిఫికేషన్​ రిలీజ్​ చేయనుంది. కరోనా కారణంగా టెన్త్ జీపీఏ గ్రేడ్​ సాధించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఈసారి పాలిటెక్నిక్​ ఎంట్రన్స్​ ద్వారా బాసర ట్రిపుల్​ ఐటీ సీట్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నష్టపోయే ప్రమాదముండటంతో తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అందుకే గతంలో అనుసరించిన విధంగానే టెన్త్ మార్కుల ప్రాతిపదికన బాసర ట్రిపుల్​ ఐటీ అడ్మిషన్లు చేపట్టాలని ప్రభుత్వం పునరాలోచన చేసింది. అందుకు సంబంధించి కొత్త నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

బాసర ట్రిపుల్​ ఐటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్​ బీటెక్​ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 1500 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లన్నీ టెన్త్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. కరోనా తీవ్రత తో రెండేండ్లుగా టెన్త్ పరీక్షలు జరగడం లేదు. టెన్త్​లో10 జీపీఏ గ్రేడ్ పాయింట్లు సాధించిన వారి సంఖ్య భారీగా ఉండటంతో ట్రిపుల్​ ఐటీ అడ్మిషన్లు ఎలా చేపట్టాలనే మీమాంస మొదలైంది. నిరుడు టెన్త్ స్టూడెంట్లకు ఇంటర్నల్ మార్కులు, ఏజ్ల​ ఆధారంగా అడ్మిషన్లు చేపట్టింది. దీంతో అడ్మిషన్ల ప్రాసెస్​కు దాదాపు రెండు నెలలు పట్టింది ఈసారి కూడా అదే పద్ధతిలో అడ్మిషన్లు చేపట్టేందుకు యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

RECENT POSTS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!