దేశ సరిహద్దుల్లో ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది బీఎస్ఎఫ్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారీ రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్ విభాగాల్లోని పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1526 పోస్టులకు రిక్రూట్ మెంట్ జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. అర్హత ఉన్నవారు అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ సబ్‌మిట్ చేయడానికి జులై 8వ తేదీ చివరి గడువు.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం CAPFలో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, అస్సాం రైఫిల్స్ లో వారెంట్ ఆఫీసర్, హవల్దార్ పోస్టులకు రిక్రూట్ మెంట్ జరుగుతోంది. మొత్తం 243 ఏఎస్ఐ,వారెంట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్, హవిల్దార్ జాబ్ రూల్స్ లో 1283 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్ పాసై ఉండాలి. అభ్యర్థులు 2024 ఆగస్టు 1 నాటికి తప్పనిసరిగా 18 ఏండ్ల నుంచి 25ఏండ్లలో పు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ వారికి వయస్సులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరికీ 5ఏండ్లు ఓబీసీలకు మూడేండ్లు, మాజీ సైనికులకు 3ఏండ్లు ఎడిషనల్ ఏజ్ లిమిట్ ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, రిజర్వ్డ్ కేటగిరీ , మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులందరూ మాత్రం సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం?
రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఈ పరీక్షను పూర్తి చేసిన తర్వాత వారికి స్కిల్ టెస్టు చేసి సెలక్ట్ చేస్తారు.
జీత భత్యాలు:
ఏఎస్ఐ, వారెంట్ ఆఫీసర్ పోస్టులకు పే స్కేల్ రూ. 29,200 నుంచి 92, 300 వరకు ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్, హవల్దార్ ఉద్యోగుల జీతం రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు ఉంటుంది.