ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్! ప్రముఖ కంపెనీ అయిన ‘రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్’దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్, డిప్లొమా , ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 326 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు..
RCFL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ వివరాలు:
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన RCFL ముంబై, రాయ్‌గడ్ (మహారాష్ట్ర) యూనిట్లలో శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతోంది. అప్రెంటిస్ చట్టం-1961 ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 326 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటిని మూడు ప్రధాన కేటగిరీలుగా విభజించారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 145 పోస్టులు (అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియట్ అసిస్టెంట్, హెచ్‌ఆర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్).
టెక్నీషియన్ అప్రెంటిస్ : 105 పోస్టులు (కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ డిప్లొమా).
ట్రేడ్ అప్రెంటిస్ : 76 పోస్టులు (కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్, బాయిలర్ అటెండెంట్ తదితర ట్రేడ్స్).
వయస్సు, అర్హతలు :
వయస్సు: అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎడ్యుకేషన్: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ లేదా ఇంటర్/ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 4 నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.
చివరి తేదీ: సెప్టెంబర్ 20 అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ విధానం :
1.అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్ www.rcfltd.com ని లోకి లాగిన్ అవ్వాలి.
- హోమ్‌పేజీలో “Recruitment” సెక్షన్‌కి వెళ్లి “Engagement of Apprentices- 2026-27” నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి.
- తర్వాత ఇచ్చిన సూచనలను చదివి, “Apply Online” పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలను ఎంటర్ చేసి, ఫోటో, సంతకం స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయాలి.
- చివరగా ఫారమ్‌ను సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.





