రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 572 ఉద్యోగాలను భర్తీ చేయున్నారు. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.ఫిబ్రవరి 4 వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాలు:
రిజర్వ్ బ్యాంక్ 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ రీజియన్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 572
పోస్టు పేరు: ఆఫీస్ అటెండెంట్
హైదరాబాద్‌లో ఖాళీలు: 36
అర్హతలు:
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులు 01-01-2026 నాటికి అండర్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. అంటే డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు కారు.
భాష: అభ్యర్థి ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో, ఆ ప్రాంతీయ భాష (తెలుగు) చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.
వయస్సు (01-01-2026 నాటికి):
అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు కాగా గరిష్ట వయస్సు 25 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 450 + 18% జీఎస్టీ చెల్లించాలి. SC/ST/PwBD/Ex-S అభ్యర్థులు రూ. 50 + 18% జీఎస్టీ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 4వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 28, మార్చి 01 తేదీల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఎంపిక విధానం:
ఎంపిక రెండు దశల్లో ఉంటుంది.
1.ఆన్‌లైన్ టెస్ట్: ఇందులో రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ , న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి (120 మార్కులు). పరీక్షా సమయం 90 నిమిషాలు.
2.లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT): ఆన్‌లైన్ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి స్థానిక భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఈ టెస్ట్ నిర్వహిస్తారు.
అప్లికేషన్ విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in/





