రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డ్.. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా సైన్స్, ఐటీ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, రిస్క్ అనాలిసిస్ వంటి కీలక రంగాలలో 93 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. నేటి నుంచి అధికారిక వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పోస్టుల వివరాలు (విభాగాల వారీగా):
3 ప్రధాన విభాగాలలో పోస్టులను భర్తీ చేస్తున్నారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (DIT): ఈ విభాగంలో మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. ఇందులో డేటా సైంటిస్ట్ (2), ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (7), ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (5), ఏఐ/ఎంఎల్ స్పెషలిస్ట్ (3), ఐటీ – సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ (5) వంటిపోస్టులు ఉన్నాయి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సూపర్‌విజన్ (DoS): ఈ విభాగంలో అత్యధికంగా 66 పోస్టులు ఉన్నాయి. ఇందులో మార్కెట్ & లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్ (11), ఐటీ – సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ (13), ఆపరేషనల్ రిస్క్ అనలిస్ట్ (2), రిస్క్ అనలిస్ట్ (5), బిజినెస్ & ఫైనాన్షియల్ రిస్క్ అనలిస్ట్ (6), డేటా సైంటిస్ట్ (4) వంటి ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి.
ప్రిమైసెస్ డిపార్ట్‌మెంట్: ఈ విభాగంలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు (5) ఉన్నాయి.
అర్హతలు: ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్, మేనేజ్‌మెంట్, లీగల్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు తమ పోస్టును బట్టి BBA, BSc, B.Tech/BE, LLB, CA, LLM, MSc, ME/M.Tech, MBA, MCA లేదా PGDBA ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు , పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 3,10,000 నుంచి రూ. 6,00,000 వరకు వేతనం లభిస్తుంది.
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ. 600 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 17 నుంచి జనవరి 06,2026 సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: www.rbi.org.in
అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ https://rbi.org.in/home.aspx ద్వారా ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.





