ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి చెందిన సర్వీసెస్ బోర్డు విభాగం గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 303 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు: గ్రేడ్ బి ఆఫీసర్లు (జనరల్)–238, గ్రేడ్ బి ఆఫీసర్లు (ఎకనమిక్ అండ్ పాలిసీ రిసెర్చ్ విభాగం(డీఈపీఆర్) – 31, గ్రేడ్ బి ఆఫీసర్లు (స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగం(డీఎస్‌ఐఎం) – 25, అసిస్టెంట్ మేనేజర్లు (రాజ్‌భాష) – 6, అసిస్టెంట్ మేనేజర్లు (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ) – 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 18 వరకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మార్చి 28 నుంచి ప్రారంభం అవుతుంది.
ఎగ్జామ్స్: గ్రేడ్ బి ఆఫీసర్లు (జనరల్) ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష మే28న ఉంటుంది. ఫేజ్ 2 ఆన్‌లైన్/ రాత పరీక్ష జూన్ 25న నిర్వహిస్తారు. డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్ జులై 2న, ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్ష ఆగస్టు 6న ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్లు ఆన్‌లైన్/ రాత పరీక్ష మే 21న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.rbi.org.in వెబ్సైట్ను సంప్రదించాలి.