రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలోని మొత్తం 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అమంగల్, చేవెళ్ల, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్నగర్ ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సంబంధిత ప్రాజెక్టుల పరిధిలో.. స్థానికంగా నివసించే అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
విద్యార్హత, వయోపరిమితి వివరాలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత విద్యార్హతలు కలిగి ఉండాలి. అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం ఇంటర్ పాసై ఉండాలి. ఒక వేళ కొన్ని ప్రాంతాలలో ఇంటర్ అర్హత గల వారు అందుబాటులో లేకపోతే.. టెన్త్ పాసైన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 01.07.2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయో సడలింపు వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ అప్లికేషన్ పూర్తి చేయాలి.
సూచనలు:
అప్లై చేసే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదవడం ముఖ్యం. ఏఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీలు ఉన్నాయి. ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు కేటాయించారనే.. పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. కేవలం మహిళా అభ్యర్థులు, స్థానికంగా నివసించే వారు మాత్రమే అర్హులు.





