రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR), జబల్‌పూర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 2521 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ wcr.indianrailways.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు:
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో పాటు.. సంబంధిత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా.. అభ్యర్థుల వయస్సు 17.11.2022 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. కొన్ని వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు ఇచ్చారు. అభ్యర్థులు, ఆ వివరాలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఇతర వివరాలు..
ఇంకా అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపికైన వారి జాబితాను రూపొందించనున్నారు. దరఖాస్తు సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. 08125930726 నంబరును లేదా rrc.jblpr2022@gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
W.R.C