HomeJOBSపంజాబ్​ నేషనల్​ బ్యాంక్​లో లోకల్​ బ్యాంక్​ ఆఫీసర్​ జాబ్స్​

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​లో లోకల్​ బ్యాంక్​ ఆఫీసర్​ జాబ్స్​

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LOCAL BANK OFFICER) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 750 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో 88 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయాలి. అప్లికేషన్లకు చివరి తేదీ నవంబర్ 23. 

పోస్టులు: 750. తెలంగాణ 88 (ఎస్సీ 13, ఎస్టీ 6, ఓబీసీ 36, ఈడబ్ల్యూఎస్ 13, అన్ రిజర్వ్​డ్ 38, పీడబ్ల్యూబీడీ 03), ఆంధ్రప్రదేశ్  05 (ఓబీసీ 01, అన్ రిజర్వ్​డ్ 04)  పోస్టులు ఉన్నాయి. 

అర్హతలు
* గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్లికేషన్ సమర్పించే తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో పొందిన శాతాన్ని తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు అప్లై చేసే రాష్ట్ర స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 
* ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లరికల్/ ఆఫీసర్ కేడర్​లో కనీసం ఏడాది పోస్ట్ క్వాలిఫికేషన్  ఉండాలి.
* వయోపరిమితి: 20 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు 
ఆన్​లైన్​లో అప్లికేషన్​ భర్తీ చేయాలి. . 
* అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 03.
* లాస్ట్ డేట్: నవంబర్ 23. 
* అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.59. ఇతరులకు రూ.1180. 
* సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
* ఆన్ లైన్ టెస్ట్: 2025, డిసెంబర్/ 2026 జనవరిలో నిర్వహించే అవకాశం ఉన్నది. 

పూర్తి వివరాలకు pnb.bank.inవెబ్​సైట్లో సంప్రదించగలరు.

పరీక్ష విధానం
ఆన్​లైన్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు (35 నిమిషాలు), డేటా అనాలసిస్ & ఇంటర్​ప్రిటేషన్ 25 ప్రశ్నలు 25 మార్కులకు (35 నిమిషాలు), ఇంగ్లిష్​ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు (25 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు (35 నిమిషాలు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్​నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు (50 నిమిషాలు) అడుగుతారు. 

* నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. 
* ఆన్​లైన్ టెస్టులో కనీస అర్హత సాధించాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 
* స్క్రీనింగ్ టెస్ట్: ఆన్​లైన్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల అప్లికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 
* లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్: పదోతరగతి లేదా 12వ తరగతిలో ఒక సబ్జెక్టుగా అప్లై చేసుకున్న రాష్ట్రంలోని స్థానిక భాషను అభ్యసించని అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్(ఎల్ఎల్​పీటీ) నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఎల్ఎల్​పీటీలో అర్హత సాధించని వారిని ఫైనల్ సెలెక్షన్​కు పరిగణనలోకి తీసుకోరు. 
* పర్సనల్ ఇంటర్వ్యూ: ఆన్​లైన్ టెస్ట్, ఎల్ఎల్​పీటీలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధించాలంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం(22.5 మార్కులు), ఇతరులు 50 శాతం (25 మార్కులు) సాధించాల్సి ఉంటుంది. 
* ఫైనల్ సెలెక్షన్: ఆన్​లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here