HomeLATESTపంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్​ ఆఫీసర్​ జాబ్స్​

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్​ ఆఫీసర్​ జాబ్స్​

Advertisement

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) 145 స్పెషల్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మే 7వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

పోస్టులు: మేనేజర్లు (రిస్క్‌)– 40, మేనేజర్లు (క్రెడిట్‌)– 100, సీనియర్‌ మేనేజర్లు (ట్రెజరీ)– 5 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల్ని అనుసరించి సీఏ/ సీఎంఏ (లేదా) కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ (ఫైనాన్స్‌)/ పీజీడీఎం (ఫైనాన్స్‌)/ తత్సమాన పీజీ డిగ్రీ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణత. పని అనుభవం కూడా ఉండాలి. వయసు 25 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన ప్రాసెస్​: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష మొత్తం 220 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో పార్ట్‌ 1, పార్ట్‌ 2 విభాగాలు ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది. రీజనింగ్​, ఇంగ్లిష్; ఆప్టిట్యూడ్​, ప్రొఫెషనల్​ నాలెడ్జ్​ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్‌ 1, పార్ట్‌ 2లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని పర్సనల్‌ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూ 25 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

Advertisement

అప్లికేషన్​ ప్రాసెస్​: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్​ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. పరీక్ష జూన్​ 12వ తేదీన నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.pnbindia.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!