పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా 1000 ‘లోకల్ బ్యాంక్ ఆఫీసర్’ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీతో పాటు 18 నెలల బ్యాంకింగ్ అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 85,000 వరకు జీతం ఇస్తారు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 20 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026-పూర్తి వివరాలు:
ఖాళీల వివరాలు:
మొత్తం 1000 పోస్టులలో ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 200, గుజరాత్‌లో 125, పంజాబ్‌లో 100 ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో 30, ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు:
1.గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
2. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్‌లో కనీసం 18 నెలల పని అనుభవం ఉండటం తప్పనిసరి.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి (02.03.1996 – 01.03.2006 మధ్య జన్మించి ఉండాలి). ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులు JMGS I స్కేల్‌లో చేరతారు. జీతంతో పాటు 3 ఇంక్రిమెంట్లు, DA, HRA, మెడికల్ అలవెన్సులు కలుపుకుని నెలకు దాదాపు రూ. 85,920 వరకు అందుకోవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ , పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్: అభ్యర్థులు అప్లై చేసుకున్న రాష్ట్ర స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
SC/ST/PwBD అభ్యర్థులకు: రూ. 100 + GST.
General/OBC/EWS అభ్యర్థులకు:రూ. 850 + GST.
అప్లై చేసుకునే విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ punjabandsind.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఫోటో, సంతకం, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.





