HomeJOBSఐటీఐ,డిగ్రీ అర్హతతో పవర్‌గ్రిడ్‌లో.. అప్రెంటిస్ పోస్టులు

ఐటీఐ,డిగ్రీ అర్హతతో పవర్‌గ్రిడ్‌లో.. అప్రెంటిస్ పోస్టులు

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 270 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఎలాంటి రాత పరీక్ష,ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోస్టును బట్టి రూ.13,500 నుంచి రూ.17,500 వరకు స్టైపెండ్ లభిస్తుంది. ఈ పోస్టులకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు

పోస్టుల వివరాలు, అర్హతలు:
దేశవ్యాప్తంగా మొత్తం 270 అప్రెంటిస్ శిక్షణ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఐటీఐ-ఎలక్ట్రిషియన్: ఐటీఐ (ఎలక్ట్రిషియన్) పూర్తి చేసిన వారు.

డిప్లొమా (ఎలక్ట్రికల్/సివిల్): సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు.

గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్/సివిల్): బీఈ / బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు.

ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 25 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

చివరి తేదీ: సెప్టెంబర్ 10 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

శిక్షణ కాలం: 1 సంవత్సరం

స్టైపెండ్ (జీతం) వివరాలు:
శిక్షణ సమయంలో అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ స్టైపెండ్ లభిస్తుంది. ఐటీఐ ట్రేడ్‌ వారికి రూ.13,500, డిప్లొమా అభ్యర్థులకు రూ.15,000, గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు రూ.17,500 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.

ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు తమ అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్‌ లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి అప్రెంటిస్‌గా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here