Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటెన్త్ అర్హతతో పోస్టల్ జాబ్స్.. దరఖాస్తుకు ఇంకా ఒక్కరోజే ఛాన్స్

టెన్త్ అర్హతతో పోస్టల్ జాబ్స్.. దరఖాస్తుకు ఇంకా ఒక్కరోజే ఛాన్స్

ఇండియన్ పోస్టల్ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది పలు ఉద్యోగాలను (Postal Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది పోస్టల్ శాఖ. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 188 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 61, మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్ – 56, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ విభాగంలో 71 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 23న ప్రారంభమైంది. దరఖాస్తులకు నవంబర్ 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు: మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. ఇతర ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. అయితే.. ఈ ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు విద్యార్హతలో పాటు సంబంధిత క్రీడల్లో నైపుణ్యం కలిగినట్లు సర్టిఫికెట్లు కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://dopsportsrecruitment.in/

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

35 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!