TS POLYCET 2022 తెలంగాణ పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు ఆన్లైన్లో అప్లికేషన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 4వ తేదీ వరకు తుది గడువు ఉంది. పాలిసెట్ అప్లై చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. 2022 టెన్త్ ఎగ్జామ్ హాల్ టికెట్లను ప్రభుత్వం పరీక్షల విభాగం ఇటీవలే జారీ చేసింది. దీంతో పాలీసెట్‌కు అప్లై చేసే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసే విద్యార్థులు పాటించాల్సిన స్టెప్ బై స్టెప్ వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. జూన్ 30వ తేదీన పాలిసెట్ ఎగ్జామ్ జరుగుతుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ల అఫిషియల్ వెబ్‌సైట్‌కు ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
CLICK HERE TO APPLY FOR TS POLYCET 2022
టీఎస్ పాలిసెట్-2022 దరఖాస్తు విధానం
STEP-1: టీఎస్ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ https://polycetts.nic.in/ సందర్శించాలి
STEP-2: విద్యార్థి తన ఆధార్ నెంబర్, టెన్త్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అప్పుడే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
STEP-3: అప్లికేషన్ లో ఉన్న వివరాలన్నీ పూర్తి చేయాలి. పేరు, తండ్రిపేరు, జెండర్, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, స్కూల్, టెన్త్ వివరాలన్నీ ఫిల్ చేయాలి.