ఇటీవల పోలీస్ నియామక పరీక్షల్లో అన్ని కేటగిరీ అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలో60 మార్కులు కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రటించారు. దీనిలో భాగంగానే నేడు తెలంగాణ పోలీస్ నియామక మండలి దీనిపై నిర్ణయం తీసుకుంది. కట్ ఆఫ్ మార్కులను సవరిస్తూ జీవో జారీ చేసింది.
ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీ అభ్యర్థులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 20 శాతం మార్కులను కేటాయిస్తున్నట్లు వెబ్ సైట్ లో వెబ్ నోటీస్ జారీ చేశారు. దీంతో 200 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 మార్కులు, బీసీ అభ్యర్థులు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 40 మార్కులు పొందితే పీఈటీ పరీక్షలకు అర్హత సాధించినట్లుగా తెలిపారు. దీనిపై మొత్తం రెండు సప్లిమెంటరీ నోటిఫికేషన్లు విడుదల చేశారు.