ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ.. 2026 సంవత్సరం కోసం అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 5,138 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి శిక్షణ కాలంలో స్టైపెండ్ అందిస్తూ.. బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పిస్తారు.
PNB అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్-పూర్తి వివరాలు
ఖాళీల వివరాలు:
మొత్తం- 5138 అప్రెంటిస్ పోస్టులు
కేటగిరీల వారీగా ఖాళీలు..
UR (Unreserved): 2383
OBC: 1110
SC: 887
ST: 294
EWS: 464
తెలంగాణలో 69, ఆంధ్రప్రదేశ్‌లో 56 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
విద్యార్హత: అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 31.12.2025 నాటికే రిజల్ట్ వచ్చి ఉండాలి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 01.01.2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
స్థానిక భాష: అభ్యర్థులు తాము అప్లై చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, మాట్లాడటం) కలిగి ఉండాలి.
జీతం (స్టైపెండ్) వివరాలు:
శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్టైపెండ్ ఇస్తారు.
రూరల్/సెమీ-అర్బన్/అర్బన్ ప్రాంతాలు.. నెలకు రూ. 12300, మెట్రో నగరాల్లో నెలకు రూ. 15,000 చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
Gen/OBC/EWS (పురుషులు): రూ. 944
Gen/OBC/EWS (మహిళలు): రూ. 708
SC/ST/PwBD/ట్రాన్స్‌జెండర్లు: రూ. 236
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది.
1.ఆన్‌లైన్ రాత పరీక్ష: 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ , కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయి.
2.స్థానిక భాషా పరీక్ష: ఎంపికైన అభ్యర్థుల రాష్ట్ర స్థానిక భాషపై అవగాహనను పరీక్షిస్తారు.
3.డాక్యుమెంట్ వెరిఫికేషన్.
4.మెడికల్ టెస్ట్.
అప్లికేషన్ విధానం:
అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి 24వతేదీ వరకు PNB అధికారిక వెబ్‌సైట్ (pnb.bank.in) లేదా bfsissc.com ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.





