HomeJOBSపంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 545 ఆఫీసర్ పోస్టులు..పూర్తి వివరాలివే!

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 545 ఆఫీసర్ పోస్టులు..పూర్తి వివరాలివే!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఇటీవల లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి అప్లికేషన్ గడువును బ్యాంకు తాజాగా పొడిగించింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి గతంలో నిర్ణయించిన గడువు ముగియనుండటంతో.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లకు అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 545 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.

మొత్తం ఖాళీలు – రాష్ట్రాలవారీగా వివరాలు:
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (JMGS-I) పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని 17 రాష్ట్రాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో 42, తెలంగాణలో 41 చొప్పున పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు తాము అప్లై చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కేవలం ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్లకు చివరి తేదీ: ఆగస్ట్ 16 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ : ఆగస్టు లేదా సెప్టెంబర్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

అర్హతలు:

విద్యార్హత: కేంద్ర ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థల ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

అనుభవం: ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంకులో క్లరికల్ లేదా ఆఫీసర్ కేడర్‌లో కనీసం ఒక ఏడాది పోస్ట్ క్వాలిఫికేషన్ పని అనుభవం తప్పని సరిగా ఉండాలి.

జీతం, ఎంపిక విధానం:
ఎంపికైన అభ్యర్థులకు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMGS-I) కింద జీతం ఇస్తారు.

ఎంపిక ప్రక్రియలో భాగంగా.. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ తర్వాత స్క్రీనింగ్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LLPT), చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 59 (పోస్టేజ్ ఛార్జీలు + జీఎస్‌టీ), మిగతా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 1180 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

అప్లికేషన్ విధానం:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పీఎన్‌బీ అధికారిక వెబ్‌సైట్ pnb.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here