ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) 2026-27 విద్యా సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ (NRI), ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా కింద అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ వంటి రంగాలపై ఆసక్తి ఉన్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు మే 6 లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
పీజేటీఏయూ యూజీ అడ్మిషన్ల పూర్తి వివరాలు:
అందుబాటులో ఉన్న కోర్సులు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు రకాల కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు.
బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్
బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)
బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్
అర్హతలు:
1.ఈ కోర్సులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లో బైపీసీ (Bi.P.C.) లేదా ఎంపీసీ (M.P.C.) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
2.అభ్యర్థులు నిర్ణీత వయస్సు, విద్యా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అప్లికేషన్లకు చివరి తేదీ: మే 6.
అప్లికేషన్ విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.pjtau.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సమయంలో అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





