HomeLATESTఆస్కీలో పీజీడీఎం రెండేళ్ల కోర్సు

ఆస్కీలో పీజీడీఎం రెండేళ్ల కోర్సు

హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్​ ఇండియా (ఏఎస్​సీఐ – ఆస్కీ) పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ (పీజీడీఎం) కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ళ కాలవ్యవధి ఉన్న ఈ పీజీడీఎం కోర్సుకు ఏఐసీటీఇ ఆమోదం ఉంది. మేనేజ్​మెంట్​ నిర్ణయాల్లో బిగ్ డేటా అనలిటిక్స్​ ఉపయోగించుకోవడంపై ఈ కోర్సు ప్రధానంగా ఫోకస్ చేస్తోంది.

ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు డ్యూయల్ స్పెషలైజేషన్ చేసే అవకాశం ఉంది. హ్యూమన్​ రిసోర్స్​ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్ మెంట్, ఫైనాన్స్ మేనేజ్​మెంట్​, ఆపరేషన్స్ మేనేజ్​మెంట్​ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీటికి తోడు సెక్టోరియల్ ఏరియా పరిధిలో ఎనర్జీ మేనేజ్​మెంట్​, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్​మెంట్​, హెల్త్ సిస్టమ్స్ మేనేజ్​మెంట్​, ఎన్విరాన్ మెంట్ మేనేజ్​మెంట్​ వంటివి ఉన్నాయి. వీటి నుంచి రెంటిని తీసుకునే సదుపాయాన్ని విద్యార్థులకు కలుగజేస్తోంది.

Advertisement

రెండేళ్ళ ప్రోగ్రాంలో 33 కోర్సులను చదవాల్సి ఉంటుంది. వీటిలో 21 కంపల్సరీ.. మరో 12 ఎలక్టివ్. ఇవి కాకుండా ప్రతి సెమిస్టర్లో అదనంగా నాలుగు నాన్ కోర్ కోర్సులను చేయాలి.

కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సు చేసేందుకు ఆర్హులు. సిఎటి/ ఎక్స్ఎటి/ సిఎంఎటి ఎంఎటి/ జీమ్యాట్/ ఆట్మాలో వ్యాలిడ్ స్కోర్ పొంది ఉండాలి.

త్వరలో ఆరంభం కానున్న కోర్సులో చేరదలుచుకున్న అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి

Advertisement

ఆస్కీ దేశంలోనే తొలి స్థానంలో, ఆసియాలో మూడో స్థానంలో ఉంది. సివిల్ సర్వీసెస్ శిక్షణ సంస్థగా మొదట్లో ఆరంభమైంది. ప్రభుత్వం అధ్వర్యంలోని ఈ సంస్థ ఏటా 200 వరకు వివిధ శిక్షణ కార్యక్రమాలను ఆఫర్ చేస్తూ ఉంటుంది. గత ఏడాది 46దేశాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది ఆస్కీ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పీజీడీఎం కోర్సు బ్రోచర్ ఇక్కడ డౌన్​లోడ్​ చేసుకొండి. https://ascipgdm.in/wp-content/uploads/2020/01/PGDM-Brochure-Jan-30-2020-1-1.pdf

మరింత సమాచారం కోసం వెబ్​సైట్ క్లిక్​ చేయండి. ​ https://ascipgdm.in

Advertisement


PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!