హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీహెచ్) పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్, సీడ్ వ్యాలీడ్ స్కోర్ లేదా అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
పీజీలో ఎంఏ, ఎంటెక్, ఆన్లైన్ ఎంటెక్, ఎం డిజైన్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు ఉంటుంది. ఎంటెక్ ఇన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ వ్యవధి మూడు నుంచి ఐదేళ్లు ఉంటుంది. ఎంఏ ప్రోగ్రామ్‌లో చేరేందుకు ఏదేని డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు, ఎండిజైన్ ప్రోగ్రామ్‌లో చేరేందుకు ఇంటర్ తర్వాత కనీసం 55 శాతం మార్కులతో అర్కిటెక్చర్, ఇంటీరియల్ డిజైన్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంటెక్‌లో చేరే వారు 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మసీ, బీవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
పీహెచ్డీ ప్రోగ్రామ్ వ్యవధి ఐదేళ్ల ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఫెలోషిప్ అందజేస్తారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయో మెడికల్, బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, క్లైమేట్ చేంజ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, లిబరల్ ఆర్ట్స్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్, మేథమేటిక్క్, మెకానికల్ అండ్ ఏరో స్పేస్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ విభాగాల్లో పీహెచ్డీ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థి ఎంచుకున్న విభాగంలో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎండీ, ఎండీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఏ, ఎమ్మెస్సీ సంబంధిత మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఈ, బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిజైన్ విభాగాల్లో చేరే అభ్యర్థులు ఎం డిజైన్, ఎం ఆర్క్‌లో ఎంఫిల్, ఎంఎఫ్ఏ, పీజీ డిప్లొమా ఇన్ డిజైన్ పూర్తి చేసి ఉండాలి. గేట్, సీడ్, సీఎస్ఐఆర్, నెట్, జేఆర్ఎఫ్, యూజీసీ నెట్ జేఆర్ఎఫ్, రీసెర్చ్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది.
పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో చేరేందుకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్, బీసీలకు రూ.500, మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు రూ.300 చెల్లించాలి.
వెబ్సైట్ www.iith.ac.in