Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ అఫైర్స్ వ్యక్తులు-అవార్డులు (మార్చి 2020)

కరెంట్ అఫైర్స్ వ్యక్తులు-అవార్డులు (మార్చి 2020)

Persons and Awards Current Affairs

Advertisement

వ్యక్తులు

సర్బానంద్ సోనేవాల్

 అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి  సర్బానంద్ సోనేవాల్ స్వరాజ్ అవార్డ్స్– 2020లో భాగంగా  డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అవార్డుకు ఎంపికయ్యారు. రాజకీయ అవగాహన విభాగంలో ఆయనకు అవార్డు లభించింది.

Advertisement

మహమ్మద్ రసౌలీఫ్:

 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1 వరకు జరిగిన 70వ బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఇరాన్ చిత్ర దర్శకుడు మహమ్మద్ రసౌలీఫ్​కు   గోల్డెన్ బియర్ అవార్డు లభించింది. ‘దెర్ ఈజ్‌ నో ఎవిల్‌’ అనే చిత్రానికి దర్శకుడిగా అవార్డుకు ఎంపికయ్యాడు.

మహియుద్దిన్ యాసిన్‌

Advertisement

ఇటీవల రాజీనామా చేసిన ప్రపంచంలో అత్యంత వృద్ధ ప్రధాని (94 )  మహథిర్ మహమ్మద్ స్థానంలో మలేషియా నూతన ప్రధానిగా నియమించబడ్డాడు.

సంజయ్  కుమార్ పాండా

టర్కీలో భారత రాయబారిగా సీనియర్ దౌత్యాధికారి సంజయ్ కుమార్ పాండా నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మార్చి 3న వెల్లడించింది. 1991 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కి చెందిన సంజయ్ ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కో(అమెరికా)లో భారత కాన్సులేట్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

ప్రవీణ్‌ రావు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వి. ప్రవీణ్‌రావుకు 2017–19 కాలానికి ఏడో ఎంఎస్ స్వామినాథన్ అవార్డు గెల్చుకున్నారు. వ్యవసాయ పరిశోధన, బోధన, పరిపాలన రంగాలలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందుకోనున్నారు. ఇండియా, ఇజ్రాయెల్‌, దక్షిణాఫ్రికాలో మైక్రో ఇరిగేషన్‌పై 13 పరిశోధనలు, 6 కన్సల్టెన్సీ ప్రాజెక్టులను ప్రవీణ్‌రావు నిర్వహించారు. ఈ అవార్డును రిటైర్డ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జూన్‌లో అందించనుంది.

గోగినేని సుజాత

Advertisement

రక్షణ, ఉత్పాదక రంగంలో సాధించిన విజయాలకు గుర్తింపుగా కేంద్ర రక్షణ శాఖ ప్రతి సంవత్సరం పద్మభూషణ్ అవార్డుకు సమానంగా అందించే ‘ఆయుధ భూషణ్ అవార్డు’ను 2019 ఏడాదికి గోగినేని సుజాతకు లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన సుజాత సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ డిఫెన్స్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్‌‌గా వ్యవహరిస్తున్నారు. మార్చి 18న కోల్‌కతాలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.

బిమల్ జుల్కా

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ)గా సమాచార కమిషనర్‌ (ఐసీ)గా ఉన్న బిమల్‌ జుల్కా మార్చి 6న పదవీబాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లోరాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జుల్కా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటివరకు సీఐసీ గా ఉన్న సుధీర్ భార్గవ జనవరి 11 న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జుల్కాను ఎంపికచేశారు. 10 మంది కమిషనర్లు ఉండాల్సిన కేంద్ర సమాచార కమిషన్‌లో ప్రస్తుతం ఆరుగురు కమిషనర్లు మాత్రమే ఉన్నారు.

Advertisement

జస్టిస్ భన్సిలాల్‌భట్

న్యూఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్‌(ఎన్‌క్లాట్)కి 3 నెలల కాలవ్యవధికి తాత్కాలిక ఛైర్‌‌పర్సన్‌గా జస్టిస్ భన్సిలాల్ భట్ ఎంపికయ్యారు. ఈ సంస్థకు తొలి ఛైర్‌‌పర్సన్‌గా వ్యవహరించిన జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ మార్చి 13న పదవీ విరమణ చేయడంతో ఈ నియామకం జరిగింది. ఈయన జమ్మూ కాశ్మీర్ హైకోర్టులో మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు.

ప్రశాంత్ కుమార్

Advertisement

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ యస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ ఎండీ సునీల్ మెహతా నాన్ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.

రవీందర్ సింగ్ థిల్లాన్

కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని నవరత్న కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా రవీందర్ సింగ్ థిల్లాన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం అదే సంస్థలో డైరెక్టర్(ప్రాజెక్ట్స్‌)గా పనిచేస్తున్నారు. 2020 జూన్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రాగా ఆయన ఈ పదవిలో 2023 మే 31 వరకు కొనసాగనున్నారు.

Advertisement

కేటరీనా సాకెల్లార్ పౌలూ

మార్చి 13 గ్రీస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా కేటరీనా సాకెల్లార్ పౌలూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె గతంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ పదవిలో ఆమె ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రోకోపిస్ పావ్లోపౌలోస్ నుంచి ఆమె అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు.

ఆదిత్య బామ్ జాయ్

Advertisement

అమెరికా పౌర హక్కుల బోర్డు అయిన ప్రైమరీ, సివిల్ లిబర్టీస్ ఓవర్‌‌సైట్ బోర్డులో సభ్యుడిగా ఇండియన్ అమెరికన్ న్యాయ నిపుణులు ఆదిత్య బామ్ జాయ్‌ను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ నియమించారు. ఈ ఏడాది జనవరిలో తన పదవీకాలం ముగియడంతో మరోసారి ఆయన్ని నియమించారు. ఇందులో ఆయన 2026 జనవరి 29 వరకు సభ్యుడిగా కొనసాగుతారు. ఉగ్రవాదంపై యుద్ధ సమయంలో పౌర స్వేచ్ఛను రక్షించేలా ఈ బోర్డు చూస్తుంది.

సత్యారప్ సిద్ధాంత

ఇండియన్ పర్వతారోహకుడు సత్యరూప్ సిద్ధాంత 7 ఖండాలలోని ఎత్తైన శిఖరాలను, అగ్ని పర్వత శిఖరాలను అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. దీంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. నేపాల్‌లోని ఎవరెస్ట్‌తో సహా  ప్రతి ఖండంలోని 7 ఎత్తైన అగ్నిపర్వత శిఖరాలు, ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా సత్యరూప్ ప్రపంచ రికార్డు కలిగి ఉన్నాడు.

జస్టిస్ జీడీ శర్మ

జమ్మూ కాశ్మీర్‌‌లో దళితులతో సహా వివిధ వెనుకబడిన వర్గాల ప్రజల సామాజిక, విద్యా వెనకబాటుతనాన్ని పరిశీలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 19న రిటైర్డ్ జడ్జి జస్టిస్ జీడీ శర్మ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భారత విదేశాంగ మాజీ అధికారి లాల్ భారతి, ఐపీఎస్ అధికారి మునీర్ అహ్మద్ ఖాన్ సభ్యులుగా ఉంటారు. రెండేళ్ల పాటు పనిచేయనున్న ఈ కమిషన్ మూడు నెలల్లోగా మధ్యంతర నివేదికను ఇవ్వనుంది.

అవార్డులు

ముకుందన్ సి మీనన్ అవార్డు

పౌర హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన వారికి అందించే ముకుందన్ సి మీనన్ అవార్డు ప్రొఫెసర్ సాయిబాబాకు లభించింది. నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అందించిన ఈ అవార్డును ఆయన సతీమణి స్వీకరించారు. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్న సాయిబాబా మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కారణంతో అరెస్టయ్యారు.

గొల్లపూడి పురస్కారం

గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు 2019 ఏడాదికి ఇద్దరికి సంయుక్తంగా లభించింది. ఉరి సినిమా దర్శకుడు ఆదిత్య థర్, మలయాళంలో తెరకెక్కించిన కుంబలంగి నైట్స్ దర్శకుడు సి. నారాయణన్‌కు సంయుక్తంగా లభించింది. గొల్లపూడి మారుతీరావు కుమారుడి పేరుతో ఉత్తమ తొలి చిత్ర దర్శకులకు ఏటా ఈ అవార్డులను అందిస్తారు.

చమేలి దేవి జైన్ అవార్డు

భారతీయ మీడియా రంగంలో మహిళా జర్నలిస్టులకు అందించే చమేలి దేవి జైన్ అవార్డును 2019 ఏడాదికి ది వైర్ పత్రిక ఎడిటర్ అర్ఫాఖానుం షెర్వాని, ఫ్రీలాన్స్ జర్నలిస్టు రోహిణి మోహన్‌లకు లభించింది. ఇండియన్ ఫ్రీడం ఫైటర్ చమేలి దేవి జైన్ పేరుతో స్టాపించిన ఈ అవార్డును 1980లో స్థాపించారు. 1981 నుంచి అందిస్తున్నారు.

రోడ్డు భద్రతా పురస్కారాలు

రోడ్డు భద్రతపై వార్తలు ప్రచురణ, సేకరణ, అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ‘రోడ్డు భద్రతా పురస్కారాల’ను అందజేస్తుంది. ఇండియా స్పీడ్‌కు చెందిన ప్రాచీ సాల్వే, దైనిక్ జాగరణ్‌కు చెందిన ప్రదీప్ ద్వివేదిలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

అబెల్ ప్రైజ్

గణిత రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ‘అబెల్ ప్రైజ్‌’ను ఈ ఏడాదికి హిల్లెల్ ఫస్టెన్‌బర్గ్(ఇజ్రాయెల్–అమెరికన్), జార్జి మార్గులిస్(రష్యన్ అమెరికన్)లు అందుకోనున్నారు. సంభావ్యత, సమూహవాదం, సంఖ్యావాదం వంటి ఉమ్మడి అంశాలపై నూతన సిద్ధాంతాలు ప్రతిపాదించినందుకు ఈ అవార్డు లభించింది. నార్వే గణితశాస్త్రవేత్త ‘నీల్ హెన్రీ అబెల్’ 200 ఏళ్లు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డును 2002 నుంచి ఏటా అందజేస్తున్నారు.

హెమింగ్ వే పురస్కారం

ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ హెమ్మింగ్ వే జ్ఞాపకార్థం అందిస్తున్న హెమింగ్ వే పురస్కారాన్ని భారత సంతతి రచయిత్రి రుచికా తోమర్‌‌కు లభించింది. ‘ఏ ప్రేయర్ ఫర్ ట్రావెలర్స్’ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. కాలిఫోర్నియాకు చెందిన రుచికా తోమర్ ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. 1976 నుంచి ఇస్తున్న ఈ బహుమతి విలువ 25వేల అమెరికన్ డాలర్లు.

టూరిజం ఇంపాక్ట్ అవార్డు

మార్చి 5 నుంచి 7 వరకు ముంబయిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ టూరిజం సదస్సులో బాలీవుడ్ డైరెక్టర్ ‘జోయా అక్తర్‌‌’కు ఈ ఏడాది టూరిజం ఇంపాక్ట్ అవార్డు లభించింది. 2011లో రిలీజైన ‘జిందగీ న మిలేగి దొబారా’ను స్పెయిన్‌లో, 2015లో విడుదలైన ‘దిల్ దడ్కనే దో’ చిత్రాన్ని టర్కీలో చిత్రీకరించడం ద్వారా సినిమా పర్యాటకాన్ని ప్రోత్సహించారని కమిటీ పేర్కొంది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ‘గల్లీభాయ్’ చిత్రం 2020లో ఆస్కార్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా పోటీపడింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!