ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్లలో పార్ట్‌టైం లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఓయూ అనుబంధ కాలేజీలైన సిద్దిపేట, నర్సాపూర్, జోగిపేట, మీర్జాపూర్, వికారాబాద్ పీజీ సెంటర్లలో ఈ ఖాళీలున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ సబ్జెక్టులతో పాటు ఎంఎల్ఐసీ, ఎంఏ, ఇంగ్లిష్, ఎకనామిక్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మ్యాథ్స్ బోధించేందుకు ఫార్ట్ టైం పద్ధతిన ఈ సెలెక్షన్లు జరుగుతాయి. నెట్ లేదా సెట్, పీహెచ్డీ ఉన్న అభ్యర్థులను అర్హులుగా పరిగణిస్తారు. అప్లై చేసిన వారందరికీ రాత పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూల ద్వారా సెలెక్షన్ చేస్తారు.పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 24 సాయంత్రం 5 గంటల లోగా ఓయూ క్యాంపస్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
