తెలంగాణ గ్రూప్ – 2 పోస్టులకు సంబంధించి నాలుగో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 23వ తేదీ న నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. సెప్టెంబర్ 13వ తేదీన మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన విషయం తెలిసిందే అయితే.. ఇందుకు సంబంధించి ఏవైనా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లు ఉంటే.. వాటిని సెప్టెంబర్ 15న సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు. కాగా నేడు నాలుగో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం టీజీపీఎస్సీ తేదీలను ప్రకటించింది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ:
సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఏమైనా అనివార్య కారణాల వల్ల ఈ తేదీల్లో హాజరు కాలేని అభ్యర్థుల కోసం సెప్టెంబర్ 25 ను రిజర్వ్ డేగా ప్రకటించారు. రిజర్వ్ డేన కూడా వెరిఫికేషన్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ వెరిఫికేషన్ ప్రక్రియ హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ (గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ) పబ్లిక్ గార్డెన్ రోడ్.. నాంపల్లిలో ఉన్న పాత క్యాంపస్‌లో జరుగుతుంది.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు:
వెరిఫికేషన్ మెటీరియల్ డౌన్‌లోడ్: సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in) నుంచి అవసరమైన మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
వెబ్ ఆప్షన్స్: అభ్యర్థులు రేపటి నుంచి సెప్టెంబర్ 25 వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో వెబ్ ఆప్షన్లను ఎంటర్ చేసుకోవాలి. తుది ఎంపికకు ఈ వెబ్ ఆప్షన్లు అత్యంత కీలకం కాబట్టి, ఆప్షన్లను ఎంపిక చేసుకునేటప్పుడు అభ్యర్థులు అత్యంత జాగ్రత్త వహించాలి.
హాజరు తప్పనిసరి: సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో తప్పనిసరిగా హాజరు కావాలి. ఒకవేళ హాజరు కాని పక్షంలో వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.






