ఓయూలో డిసెంబర్ 31న వెయ్యి మందికి పైగా పీహెచ్‌డీ విద్యార్థుల అడ్మిషన్స్ ప్రవేశాలు రద్దు కానున్నాయి. ఆయా విభాగాలలో 2016 కంటే ముందు పీహెచ్‌డీలో ప్రవేశాలు పొంది ఇంత వరకు పరిశోధనలు పూర్తి చేసి థీసిస్‌ను సమర్పించని విద్యార్థుల ప్రవేశాలను ఈ నెల 31న రద్దు చేస్తామని మూడు నెలల క్రితం ఓయూ అధికారులు ప్రకటించారు. తాజాగా యూనివర్సిటీలోని 12 డీన్స్ కార్యాలయాల ఎదుట 2016 కంటే ముందు పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలున్నారు.
విశాఖ పోర్టులో 1,112 పోస్టులు ఖాళీలు
విశాఖపట్నం పోర్టులో మొత్తం సిబ్బంది సంఖ్య 4,003 ఉండగా 1,112 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పోర్టుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ విశాఖపట్నం పోర్టుతోపాటు దేశంలోని మేజర్ పోర్టులలో అనేక ఏళ్లుగా టెక్నాలజీ, మెకనైజేషన్ కారణంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ప్రైవేట్ పోర్టులతో పోల్చుకుంటే మేజర్ పోర్టులలో సిబ్బంది సంఖ్య అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. అందువలన మేజర్ పోర్టులలో సిబ్బందిని అవసరం మేరకు మాత్రమే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.