HomeLATESTరేపటి నుంచి ఆ హాల్ టికెట్లు.. ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన

రేపటి నుంచి ఆ హాల్ టికెట్లు.. ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన

తెలంగాణలోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది. పీహెచ్డీ ప్రవేశ్ పరీక్షకు సంబంధించిన పరీక్షలను డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొత్తం 47 సబ్జెక్టులకు గాను ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు రేపటి నుంచి.. అంటే నవంబర్ 26వ తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

ఈ సారి మొత్తం 9776 మంది అభ్యర్థులు Ph.D Entrance Test-2022 కు నమోదు చేసుకున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఓ రోజు ముందుగానే వారి పరీక్ష కేంద్రాలను సందర్శించాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు http://www.ouadmissions.com/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!