ఇప్పటివరకు స్టూడెంట్లు టెక్ట్స్ బుక్స్ చూసి ఎగ్జామ్స్ రాస్తే కాపీ కొట్టినట్లే. కానీ ఇకపై పుస్తకాలు చూసుకుంటూ.. దర్జాగా అందులో నుంచి వెతిక్కుని ఎగ్జామ్ రాసేయచ్చు. ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర విద్యాశాఖ ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకు వస్తోంది. తొలిసారిగా ఈ ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో ఓపెన్ బుక్ సిస్టమ్ ద్వారా ఫస్టియర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది.
న్యూఎడ్యుకేషన్ పాలసీ అమల్లో భాగంగానే ఈ కొత్త విధానం అమలు చేస్తోంది. విద్యాశాఖలో కొంతకాలంగా ఓపెన్ బుక్ సిస్టమ్‌పై చర్చ నడుస్తోంది. ఇప్పుడు మరోసారి ఈ విధానం తెరమీదకొచ్చింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ఈ విధానం సాధ్యాసాధ్యాలపై కమిటీ వేసి, ఆ నివేదిక ఆధారంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో దీన్ని అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో 54 గవర్నమెంట్ , 76 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. పాలిటెక్నిక్ లో అన్ని బ్రాంచీల్లో ఇంగ్లిష్ కామన్. అందుకే దీంతో ఓపెన్ బుక్ సిస్టమ్‌ను ఇంగ్లిష్సబ్జెక్టుకు అమలు చేస్తున్నారు. మిగిలిన నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ గతంలో మాదిరి, పుస్తకాలు చూడకుండానే రాయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఒక్కో సబ్జెక్టును ఒపెన్ సిస్టమ్ లోకి తీసుకొస్తారు. వచ్చే ఏడాది సెకండియర్ స్టూడెంట్లకూ ఈ విధానం అమలు చేస్తారు.
అయితే ఇప్పటికే పాలిటెక్నిక్ ఫస్టియర్ మిడ్ 1,2 ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. జనవరి18 నుంచి ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. మిడ్ ఎగ్జామ్స్‌లో కొన్ని కాలేజీల్లో దీన్ని అమలు చేయగా, సెమిస్టర్ ఎగ్జామ్స్‌కు అన్ని కాలేజీల్లో పూర్తిస్థాయిలో అమలు చేయబోతున్నారు. బట్టీ విధానాన్ని పోగొట్టేందుకే ఓపెన్ బుక్ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పాలిటెక్నిక్ ఎగ్జామ్.. బుక్స్ చూసి రాసే కొత్త పాలసీ ఈ ఏడాది నుంచే అమలు
Advertisement