లాక్ డౌన్ టైమ్ లో యుడెమీ సంస్థ ఆన్లైన్లో ఉచితంగా కోర్సులను అందిస్తోంది. ఎక్కడైనా, ఏ టైంలోనైనా కంప్యూటర్ నుంచి గానీ మొబైల్లో గానీ వీటిని నేర్చుకోవచ్చు. కొత్త కెరీర్ స్టార్ట్ చేయడానికి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇవి ఉపయోగపడుతాయి. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్.. ఇంట్రస్ట్ ఉన్న ఎవరైనా వీటిని నేర్చుకోవచ్చు.
ఈ కోర్సులు మూడు విభాగాలుగా ఉన్నాయి. పర్సనల్ గ్రోత్ & వెల్నెస్, ప్రొడక్టివిటీ & ప్రొఫెషనల్ స్కిల్స్, ఎసెన్షియల్ టెక్ స్కిల్స్
ఎక్సెల్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, బ్లాక్ చెయిన్, వెబ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, సంబంధిత టెక్నాలజీ కోర్సులతో పాటు మెడిటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ ఫండమెంటల్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఇన్వెస్టింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫిట్నెస్ వంటి మొత్తం 704 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సబ్ కేటగిరీ కోర్సులున్నాయి. బిగినర్, ఇంటర్మీడియట్, ఎక్స్పర్ట్ ఇలా మీరు నేర్చుకునే స్థాయిని బట్టి విభజించి ఉన్నాయి. ఇంగ్లిష్తో పాటు హిందీలో కొన్ని కోర్సులున్నాయి.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి www.udemy.com/courses/free
స్టూడెంట్లకు ప్రొఫెషనల్స్‌కు 704 ఫ్రీ కోర్సులు
Advertisement