కరోనా తీవ్రత.. రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు,తల్లితండ్రులు కాలేజీలకు వెళ్లకుండానే గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్ ఒక ప్రకటన లో తెలిపారు. అడ్మిషన్లు కోరుకునే స్టూడెంట్లు రేపటి నుంచి (జూన్ 1 నుంచి) ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. గవర్నమెంట్ తదుపరి ఆర్డర్ ఇచ్చేంత వరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు తెరవద్దని బోర్డు ఆదేశించింది.
Advertisement
