ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) లో వివిధ విభాగాల్లో గ్రాడ్యయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు నవంబర్ 17 చివరితేది.
అర్హతలు, ఖాళీల వివరాలు
కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ఫైర్ సేప్టీ టెక్నీషియన్, ల్యాబ్ కెమిస్ట్, పెట్రోలియం ప్రోడక్ట్స్, డీజిల్ మెకానిక్, సివిల్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టులను అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నవంబర్ 17 లోగా అప్లై చేసుకోవాలి. ఎలాంటి పరీక్ష లేకుండానే అకడమిక్‌లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.9,600–12,300 స్టైఫెండ్ చెల్లిస్తారు. వెబ్సైట్ https://ongcindia.com/





