Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎయిమ్స్​లో 3803 నర్సింగ్​ ఆఫీసర్స్​

ఎయిమ్స్​లో 3803 నర్సింగ్​ ఆఫీసర్స్​

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌), న్యూఢిల్లీ నర్సింగ్​ ఆఫీసర్​ రిక్రూట్​మెంట్​ ఎలిజిబిలిటి టెస్ట్​(ఎన్​ఓఆర్​సెట్​)–2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ టెస్ట్​ ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్‌ల్లో 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్​తో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్​లో ఖాళీలున్నాయి. ఈనెల 5న రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్​ 18 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

 ఎయిమ్స్​     పోస్టులు

న్యూఢిల్లీ       597

భువనేశ్వర్​                         600

Advertisement

డియోగఢ్​   150

గోరఖ్​పూర్​                        100

జోధ్​పూర్​    176

Advertisement

కళ్యాణి         600

మంగళగిరి                        140

నాగ్​పూర్​    100

Advertisement

పాట్నా          200

రాయ్​బరేలీ                        594

రాయ్​పూర్​ 246

Advertisement

రిషికేష్​         300

అర్హత‌: బీఎస్సీ(హాన‌ర్స్‌) న‌ర్సింగ్‌/ బీఎస్సీ(న‌ర్సింగ్‌)/ బీఎస్సీ(పోస్ట్​ సర్టిఫికేట్​)/ పోస్ట్​ బేసిక్​ బీఎస్సీ నర్సింగ్ (లేదా) డిప్లొమా(జనరల్​ నర్సింగ్)తో పాటు రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.​

వ‌య‌సు: 2020 ఆగస్ట్ 18 నాటికి 18–30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్​సర్వీస్​మెన్​లకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది.

Advertisement

సెలెక్షన్​ ప్రాసెస్​: మొత్తం 200 మార్కులకు ఆన్​లైన్​ కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​ ఉంటుంది. దీనిలో మొత్తం 200 మల్టిపుల్​ ఛాయిస్​ క్వశ్చన్స్​ ఉంటాయి. 180 క్వశ్చన్స్​ అభ్యర్థి సబ్జెక్ట్​ నుంచి మిగతా 20 క్వశ్చన్స్​ జనరల్​ నాలెడ్జ్​ అండ్​ ఆప్టిట్యూడ్​ నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. ఎగ్జామ్​ డ్యురేషన్​ 180 నిమిషాలు. జనరల్​/ఈడబ్ల్యూఎస్​లకు 50%, ఓబీసీలకు 45%, ఎస్సీ/ ఎస్టీలకు 40% క్వాలిఫై పర్సంటేజ్​గా నిర్ణయించారు. కేటగిరీల వారిగా మినిమం క్వాలిఫై పర్సంటేజ్​ పొందిన అభ్యర్థులకు ఒరిజినల్​ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది.

ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్​లకు రూ.1200, పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు.

ఎగ్జామ్​ డేట్​: 2020 సెప్టెంబర్​ 1

Advertisement

వెబ్​సైట్​: www.aiimsexams.org

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!