టెన్త్ విద్యార్థులందరూ ఈ స్కాలర్ షిప్ కు తప్పక పోటీ పడండి…. టెన్త్ చదువుతున్న విద్యార్థులకు ఎన్ టీ ఎస్ ఈ స్కాలర్ షిప్ ఆఫర్ అందిస్తోంది. టాలెంట్ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ ద్వారా వీటిని అందిస్తోంది. దేశవ్యాప్తంగా రెండు వేల మందిని ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక చేస్తోంది.
ఎంపికైన వారికి ఇంటర్ చదివేటప్పుడు నెలకు రూ. 1250 చొప్పున చెల్లిస్తారు. డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్నప్పుడు నెలకు రూ.2000 అందిస్తారు. పీహెచ్ డీలో చేరిన వారికి యూజీసీ నిబంధనల మేరకు స్కాలర్ షిప్ ఉంటుంది.
ఎన్ టీ ఎస్ ఈ పరీక్ష లో రెండు స్టేజీలుంటాయి.
ఫస్ట్ స్టేజీ రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. స్టేజీ వన్ లో రెండు పేపర్లుంటాయి. అన్నీ మల్టిఫుల్ ఛాయిస్ క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు రెండు గంటల టైమ్ ఉంటుంది.
పేపర్ 1; మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (100 మార్కులు)
పేపర్ 2; స్టాటిస్టిక్ అప్టిట్యూడ్ టెస్ట్ (100 మార్కులు)
ఫస్ట్ స్టేజీలో సెలెక్టయిన విద్యార్థులకు ఎన్ టీ ఎస్ ఈ సెకండ్ స్టేజీ ఎగ్జామ్ ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది. స్టేజీ వన్ తరహాలోనే రెండు పేపర్లుంటాయి. కానీ కఠినమైన ప్రశ్నలుంటాయి. ఇందులో మెరిట్ లిస్ట్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా 2 వేల మందికి ఈ స్కాలర్ షిప్ లను ప్రకటిస్తుంది.
అర్హత;
ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులందరూ అర్హులే.
చలాన్ ద్వారా ఫీజు చెల్లించే ఆఖరు తేదీ;
నవంబర్ 10
ఆన్ లైన్లో దరఖాస్తుకు ఆఖరు తేదీ;
నవంబర్ 12
స్టేజీ వన్ పరీక్ష తేదీ;
డిసెంబర్ 13 (ఉదయం 9.30 పేపర్ 1, మధ్యాహ్నం 1.30 పేపర్2)
స్టేజీ టూ పరీక్ష తేదీ;
తర్వాత ప్రకటిస్తారు
పరీక్ష కేంద్రాలు;
అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్ సైట్; https://www.bse.telangana.gov.in/NTSE.aspx
NTSE టెన్త్ స్టూడెంట్లకు బెస్ట్ స్కాలర్ షిప్.. వెంటనే అప్లై చేయండి
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS