నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 50 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 28వ తేదీలోగా అప్లై చేయాలి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 27 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. జీతం నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. వివరాలకు www.ntpc.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.